అందరికి క్షీరాబ్ది ద్వాదశి శుభకాంక్షలు ☺️
🌺 క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ 🙏
పూర్వం ధర్మరాజు తన సోదరులతో కలిసి వనవాసంలో ఉన్నప్పుడు, వ్యాస మహర్షిని ఒక ప్రశ్న అడిగాడు.
"మహర్షీ! మానవులు పాప విముక్తి పొంది, సుఖసంతోషాలతో జీవించడానికి ఉత్తమమైన వ్రతం ఏది?" అని అడిగాడు.
అప్పుడు వ్యాస మహర్షి క్షీరాబ్ధి ద్వాదశి వ్రత మహిమను వివరించడం ప్రారంభించారు.
పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించినప్పుడు ఐరావతం, కల్పవృక్షం, మహాలక్ష్మి దేవి వంటి దివ్య సంపదలు ఆవిర్భవించాయి. తులసి దేవి కూడా ఆవిర్భవించి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రురాలైంది.
కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి, దేవతలతో కలిసి తులసి వనానికి విచ్చేసి తులసి దేవిని అనుగ్రహించాడని పురాణ కథనం.
అదే సమయంలో హరిమేధుడు, సుమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణులు తులసి వనాన్ని దర్శించారు. సుమేధుడు తులసి మహిమను వివరించగా, ఆ కథ విన్న మర్రిచెట్టులో నివసిస్తున్న ఇద్దరు శాపగ్రస్తులకు శాపవిమోచనం కలిగింది.
అందుకే క్షీరాబ్ధి ద్వాదశి రోజున తులసి అమ్మవారిని పూజించి, దీపాలు వెలిగించి, శ్రీమహావిష్ణువును ఆరాధిస్తారు.
ఈ పవిత్రమైన కథను విన్నవారికి శ్రీమహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
🪔 శ్రీ తులసీదేవ్యై నమః
🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏
🌸 సర్వేజనా సుఖినో భవంతు 🌸